English   

మరిదితో వదిన సంబంధం.. ఛీ ఛీ అంటున్న సీనియర్ హీరోయిన్ సంగీత..

Sangeetha
2019-06-13 18:03:25

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క చాన్స్ అంటూ ఖడ్గం సినిమాలో సంగీత చేసిన నటనను అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. ఈ సినిమా తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది సంగీత. కెరీర్ అన్న తర్వాత ఎన్నో సినిమాలు చేస్తుంటారు.. కానీ ఆ కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా మాత్రం ఒకటి ఉండాలి అని ఖచ్చితంగా ప్రతి నటీనటులు కోరుకుంటారు. అలాగే సీనియర్ నటి సంగీత కెరీర్లో కూడా అలాంటి ఒక సినిమా ఉంది. అయితే అది కాస్త విచిత్రంగా ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయింది. పైగా ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అంటూ చాలా సార్లు అనుకున్నా అని చెబుతోంది ఈ సీనియర్ హీరోయిన్. తెలుగులో సంక్రాంతి, ఖుషి ఖుషీగా, ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది సంగీత. ఇదిలా ఉంటే తాజాగా ఆలీతో సరదాగా షోకు ముఖ్య అతిథిగా వచ్చిన సంగీత తన కెరీర్ గురించి ఎన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది. అందులో మరీ ముఖ్యంగా మనోహర సినిమా గురించి తన మనసులో మాట బయటకు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా తాను చేయకుండా ఉండాల్సింది అంటూ చాలా సార్లు అనుకున్నానని కానీ ఆ పాత్ర తనకు చాలా పేరు తీసుకు వచ్చిందని చెబుతోంది ఈ భామ. ఇందులో మరిదిపై మనసు పడే వదిన పాత్రలో నటించింది సంగీత. దర్శకుడు ఈ కథను తన దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు లేచి అరిచేశానని.. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఇది జరుగుతుందా.. ఇలాంటి కథ తీసుకువచ్చి తన నటించమని అడుగుతున్నారు అంటూ సీరియస్ అయ్యారు అని చెబుతోంది సంగీత. అయితే ఇలాంటివి నిజంగానే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయని.. తన నిజజీవితంలో కూడా ఇది జరిగింది అంటూ దర్శకుడు చెప్పేసరికి షాక్ అయ్యాను అంటుంది సంగీత. ఒకటి రెండు రోజులు టైమ్ తీసుకుని ఆలోచించిన తర్వాత మనోహర సినిమా ఓకే చేశాను అంటుంది ఈ భామ. శ్రీ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత మనోహర సినిమా గురించి మరో సారి తన అభిప్రాయాన్ని బయటకు చెప్పింది సంగీత.

More Related Stories