English   

పటాస్ రేటింగ్ ధమాల్.. శ్రీముఖి ఎఫెక్ట్ బాగానే పడింది..

Sreemukhi
2019-06-13 18:21:08

ఈటీవీ ప్లస్ మొదలైన తరువాత అన్నింటికంటే ముందు క్లిక్ అయిన షో పటాస్. కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ డిజైన్ చేసిన ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాంకర్ రవి, శ్రీముఖి కెమిస్ట్రీ పటాస్ లో ప్రాణంగా నిలిచింది. దాదాపు వెయ్యి ఎపిసోడ్స్ పైగా ఇద్దరూ కలిసి పని చేశారు. ఈటీవీ ప్లస్ లో టాప్ రేటింగ్ షో గా దుమ్ము దులిపేస్తున్న పటాస్ కు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చింది. ఇన్నాళ్ళూ వచ్చిన రేటింగ్స్ తో పోలిస్తే ఇప్పుడు ఇది చాలా దారుణంగా పడిపోయాయని తెలుస్తోంది. దానికి కారణం యాంకర్ శ్రీముఖి బయటకు వెళ్లిపోవడమే. కొన్ని రోజులుగా పటాస్ షో నుంచి శ్రీముఖి బయటికి వచ్చేసింది. ఈమె స్థానంలో వర్షిని యాంకర్ గా చేరింది. రవి ఎప్పట్లాగే తన వంతు ప్రయత్నం బాగానే చేస్తున్న కూడా శ్రీముఖి బయటకు రావడంతో పటాస్ రేటింగ్స్ చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. కేవలం ఆమె కోసమే పటాస్ చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆమె బయటకు రావడంతో వాళ్ళు కూడా వదిలేసారు. దాంతో రేటింగ్ పై భారీ ప్రభావమే పడింది. ఉన్నట్టుండి శ్రీముఖి పటాస్ కామెడీ షో ని వదిలేయడానికి కారణాలేంటని వెతికితే.. త్వరలో మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 3లో ఈమెని కంటెస్టెంట్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దాని కోసం సిద్ధం కావడానికి పటాస్ షో నుంచి బయటకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడు పటాస్ టీం మొత్తం పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కూడా మారిపోవడంతో ఆయనతో పాటు శ్రీముఖి కూడా మానేసిందని ఒక ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కారణం ఏదైనా కూడా శ్రీముఖి బయటికి రావడం వల్ల పటాస్ కామెడీ షో రేటింగ్ మాత్రం దారుణంగా దెబ్బతింది అనేది కాదనలేని వాస్తవం.

More Related Stories