English   

సల్మాన్ ఖాన్ ఇమేజ్ పడిపోయిందా.. భారత్ కలెక్షన్ల పరిస్థితి ఏంటి..

Salman Khan
2019-06-13 18:38:05

బాలీవుడ్లో ఇప్పటికే షారుక్ ఖాన్ దాదాపు ముగిసినట్లే. ఆయన ప్రతి సినిమా వచ్చి వెళ్లి పోతుంది. గత మూడు నాలుగు ఏళ్లుగా షారుఖాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాయ చేసింది లేదు. ఇక అమీర్ ఖాన్ కూడా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తాడు అనుకుంటున్న తరుణంలో భారత్ సినిమా కలెక్షన్లు కూడా ఊహించినంతగా లేకపోవడంతో నిజంగానే ఇప్పుడు బాలీవుడ్ లో ఖన్స్ ఆధిపత్యానికి తెరపడుతుందా అనే ఆసక్తికరమైన చర్చకు తెర లేస్తుంది. భారత్ సినిమా గత వారం విడుదలైంది. ఇప్పటివరకు 7 రోజుల్లో ఈ సినిమాను 167 కోట్లు వసూలు చేసింది. సాధారణంగా అయితే సల్మాన్ ఖాన్ సినిమా రంజాన్ కి వస్తే కేవలం 5 రోజుల్లో 200 కోట్ల మార్క్ అందుకొని తన సత్తా చూపిస్తాడు సల్మాన్ ఖాన్. కానీ ఈసారి భారత్ సినిమా విషయంలో మాత్రం అలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు. సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో పాటు స్లో గా ఉంది అని నాకు కూడా వెళ్లిపోవడంతో భారత్ సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది. తొలి మూడు రోజులు అద్భుతమైన వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత నెమ్మదించింది. ముఖ్యంగా వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా కలెక్షన్లు కూడా వీక్ అయిపోయాయి. కత్రినా కైఫ్ ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో జోడీ కట్టింది. కండల వీరుడితో గతంలో టైగర్ జిందా హై, సుల్తాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకు దర్శకుడు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన భారత్ కలెక్షన్ల వేటలో వెనకబడటం డిస్ట్రిబ్యూటర్లకు అంతగా మింగుడు పడటం లేదు. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లకు భారత్ కలెక్షన్స్ కలవరపెడుతున్నాయి. మొత్తానికి ఇదే పరిస్థితి కొనసాగితే కమర్షియల్ గా భారత్ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

More Related Stories