English   

కంటెస్టెంట్ కాదట...హోస్ట్ అయితే ఓకేనట

 Renu Desai
2019-06-13 19:12:06

తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో బాగా పాపులర్ అయ్యింది. మొదటి రెండు సీజన్లు జరిగేప్పుడు జనాలు అది చూడడం కోసమే పనులు అన్నీ మానుకుని కూర్చుటున్నారంటే దానికి వచ్చిన క్రేజ్ మనకి అర్ధం అవుతుంది. మొదటి రెండు సీజన్లు విజయంవంతంగా పూర్తవడంతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ 3లో హోస్ట్ గా నాగార్జున ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే కంటెస్టెంట్స్‌గా రేణూ దేశాయ్, సావిత్రి, ఉద‌య భాను , కేఏ పాల్ వంటి సెల‌బ్రిటీలు ఉంటారని ప్రచారం న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే నిర్వాహకులు రేణును సంప్రదించారని, అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ ఆంగ్ల పత్రిక ద్వారా రేణూదేశాయ్‌ ఈ వార్తలపై స్పందించారు. తాను బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. అయితే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించాలని మాత్రం అనుకుంటున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం తాను ఓ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌తో బిజీగా ఉన్నానని, మళ్లీ నటించేందుకు సిద్ధమవుతున్నానని ఇలాంటి సమయంలో బిగ్ బాస్ లో పాల్గొననని కానీ ఒకవేళ బిగ్‌బాస్‌ నిర్వాహకులు హోస్ట్ గా వ్యవహరించాలని సంప్రదిస్తే మాత్రం అవకాశం వదులుకోనని చెప్పారు.  

More Related Stories