English   

ఆ హీరో చెల్లి హీరోయిన్ అవుతోంది

Bhavani Sre
2019-06-13 19:32:46

సినిమాల్లో వారసత్వం అనేది చాలా కామన్, తెలుగులో కానీ వేరే బాషలో కానీ ఇది సాధారణ విషయం. తాజాగా మరో అమ్మడు సినీ తెరంగ్రేటానికి సిద్దం చేసుకుంటోంది. ఆమె ఎవరో కాదు త‌మిళ హీరో, సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాశ్ కుమార్ సోద‌రి, ఏఆర్ రెహామాన్ మేన‌కోడ‌లు అయిన భ‌వానీ శ్రీ. నిజానికి రెహమాన్ మేనల్లుడిగా సంగీత దర్శకత్వం మొదలు పెట్టిన ప్రకాష్ అనతికాలంలోనే నటుడిగా కూడా మారాడు. తనకి తగ్గ లవ్ సినిమాలు చేస్తూ యూత్ లో క్రేజ్ సంపాదించుకుంటున్న ఆయన చెల్లి ఇప్పుడు సినీ తెరంగ్రేటానికి సిద్దమయ్యింది. తమిళ దర్శకుడు విరుమాండి విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక హీరొయిన్ గా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా భవానీశ్రీని ఎంపిక చేసుకున్నారని సమాచారం. నిజానికి భ‌వానీ గ‌తంలో అమ‌ల అక్కినేని న‌టించిన వెబ్ సిరీస్‌ తో నటన ప్రారంభించింది. అలా ఆమె రెండో ఛాన్స్ మంచి స్టార్ హీరోతో కొట్టేసింది మరి, ప్రస్తుతం సెట్స్‌ మీదున్న  ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. అయితే ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసే యోచన చేస్తున్నారు మేకర్స్.

More Related Stories