English   

బాలయ్య సినిమా మొదలయ్యింది...కానీ ?

Balakrishna
2019-06-13 19:43:31

నందమూరి బాలకృష్ణ కేఎస్ రవికుమార్ సి కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉండగా అది సెట్స్ మీదకు వెళ్ళకముందే ఆగిపోయిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. దానిని అబద్దం చేస్తూ ఈ సినిమాని ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు మేకర్స్. బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాని తెరకేక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, హ్యాపి మూవీస్ బ్యానర్‌ మీద ఐదో సినిమాగా నిర్మాత చిల్లర కళ్యాణ్ నిర్మించనున్నారు. బాలయ్య 105వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ముహూర్తపు షాట్ కి డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేసాడు. ఇక మెగా డైరెక్టర్ కోదండరామి రెడ్డి ఫస్ట్ షాట్ ని డైరెక్ట్ చేసారు. జూలైనుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని చెబుతున్న ఈ సినిమాకి క్రాంతి, రూలర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్త‌యిందని చెబ్తున్నా కానీ వివరాలు మాత్రం బయట పెట్టలేదు.  

More Related Stories