English   

ఎన్టీఆర్ రెండో కోడుకు ఫస్ట్ బర్త్ డే...వైరల్ అవుతున్న పిక్స్

 Jr NTR
2019-06-14 12:09:05

ఎన్టీఆర్ దంపతులకు గత ఏడాది రెండో మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. గత ఏడాది బాబు పుట్టగా ఆ బాబుకి భార్గవ్ రామ్ అనే పేరు పెట్టుక్కున్నారు. ఈరోజు ఆ బుడ్డోడి మొదటి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో తారక్ ఇన్స్టా గ్రామ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. భార్గవ్ కు అప్పుడే ఏడాది వయసు వచ్చేసిందని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా భార్గవ్ తో తాను, అలాగే అభయ్ దిగిన ఫొటోలను ఎన్టీఆర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు భార్గవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో రెండో కుమారుడిని చూసి మురిసిపోతున్నారు. భార్గవ్ కూడా బుగ్గన చొట్టతో ముసుముసినవ్వులు  నవ్వుతూ మరీ ముద్దోచ్చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ హైదరబాద్ లో సైలెంట్ గా జరుగుతోంది. 

More Related Stories