English   

మహేష్ బాబును కంట్రోల్ చేస్తున్న నమ్రతా శిరోద్కర్..

Namrata
2019-06-14 14:30:27

ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు.. ఇప్పుడు మహేష్ బాబుని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. నమ్రతా శిరోద్కర్ తన జీవితంలోకి రాకముందు ఒకలాగా.. వచ్చిన తర్వాత మరోలా మారిపోయాడు సూపర్ స్టార్. తన విజయానికి ప్రతి మెట్టూ నమ్రతా శిరోద్కర్ అంటూ చాలా సార్లు చెప్పాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు సినిమాల విషయంలోనే కాకుండా నిర్మాణం విషయంలో కూడా పూర్తిగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఇప్పుడు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకెళ్తున్నాడు. వరుసగా తన సినిమాలతో పాటు ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే అడవి శేష్ హీరోగా వస్తున్న మేజర్ సినిమాను ఘట్టమనేని మహేష్ బాబు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నాడు మహేష్. 

ఈ సినిమాను తెరవెనుక అన్ని తానే దగ్గరుండి చూసుకుంటుంది నమ్రత. దాంతో పాటు విజయ్ దేవరకొండతో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని పర్సనల్ గా తీసుకుంటుందని.. అందుకే గత మూడేళ్లుగా ఆయన టాప్ గేర్ లో ఉందని తెలుస్తుంది. సూపర్ స్టార్ కు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రతి విషయాన్ని తీసుకొని ఆయనకు కేవలం నటన మాత్రమే ఉండేలా చూసుకుంటుంది నమ్రత. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఘట్టమనేని మహేష్ బాబు ప్రొడక్షన్ లో తెరకెక్కుతోంది. దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు కూడా నిర్మాణంలో భాగస్వామిగా మారాడు. గతంలో బ్రహ్మోత్సవం, నేనొక్కడినే సినిమా ఫ్లాపు ప్రభావం మహేష్ బాబు మీద తీవ్రంగా ఉండటంతో ఇప్పుడు నిర్మాణ బాధ్యతను పూర్తిగా నమ్రతా శిరోద్కర్ తీసుకొని ఆయన టెన్షన్ ను తగ్గించే పనిలో ఉంది. ఏదేమైనా కూడా మహేష్ బాబును పూర్తిగా కంట్రోల్ చేస్తుంది నమ్రతా శిరోద్కర్.

More Related Stories