English   

నానాకి కోర్టు క్లీన్ చిట్...తనుశ్రీ సంచలన వ్యాఖ్యలు

Tanushree Dutta
2019-06-14 16:51:11

బాలీవుడ్ మొదలు కేంద్రమంత్రులదాకా మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరందరికీ వరుసగా క్లీన్ చిట్స్ వస్తున్నాయి. లైంగిక ఆరోపణలు చేసిన వారు దానికి తగిన సాక్ష్యాలు చూపకపోవడంతో ఆ కేసులు తెలిపోతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ నటుడు నానాపటేకర్‌ మీద నటి తనుశ్రీదత్తా చేసిన లైంగిక ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.  కొంతకాలం క్రితం దేశంలో మీటూ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో తనుశ్రీ దత్తా సంచలనాత్మక రీతిలో నానా పటేకర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దాదాపు పదేళ్ల క్రితం హార్న్ ఓకే ప్లీజ్ చిత్రంలో నటిస్తున్న సమయంలో నానా తనను లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు నానా పటేకర్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించలేకపోయారు. అయితే, తనుశ్రీ న్యాయవాది సుజయ్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ, నానా పటేకర్ కు భయపడి కొందరు సాక్షులు ముందుకు రావడంలేదని, తనుశ్రీ దీనిపై ప్రొటెస్ట్ రిపోర్ట్ దాఖలు చేస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనుశ్రీ దత్తా కూడా స్పందించింది. పోలీస్, న్యాయ‌వ్య‌వ‌స్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించింది తనుశ్రీ. ఈ రెండు వ్య‌వ‌స్థ‌లు ఎక్కువ అవినీతిప‌రుడైన వ్య‌క్తి (నానాపటేకర్)కి క్లీన్ చిట్ ఇచ్చాయని ఫైర్ అయింది.  

More Related Stories