English   

ప్రేమ పేరుతో పెళ్లి...ఆపై చంపాలని ప్లాన్ చేసిన వర్ధమాన నటుడు

Sabrish Shetty
2019-06-14 17:13:29

ఒక సినిమా నటుడు తన భార్యను చంపే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనకి సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ యువతికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అప్పటికే పెళ్లి అయినా రెండో పెళ్లి చేసుకున్నాడు. అతని మోసాన్ని పసిగట్టి ప్రశ్నించిన ఆమెను మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి పడుకోబెట్టాడు, లేగిస్తే మళ్ళీ ప్రశ్నిస్తుంది అనుకుని ఆమెను చంపబోయాడు. కానీ ఆమె అదృష్టం కొద్దీ ఆమెను కలవడానికి ఆమె స్నేహితుడు రావడంతో ఆమె బతికిపోయింది.  బెంగళూరుకి చెందిన శబరీష్‌ శెట్టి అనే వర్థమాన నటుడు పలు కన్నడ చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించాడు. హీరోగా నటించిన అరుణ్, జనన అనే రెండు సినిమాలు మొదలయి ఆగిపోయాయి. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న పద్మశ్రీ అనే యువతితో పరిచయం పెంచుకున్న నిందితుడు తనకు కన్నడలో పెద్ద హీరోలు, నిర్మాతలు తెలుసని చెప్పి వారితో దిగిన ఫొటోలు చూపించి పద్మశ్రీని ప్రేమలోకి దించాడు. కొద్ది కాలం తరువాత ఆమెను పెళ్లి చేసుకుని కేఆర్‌ పురం లో కాపురం కూడా పెట్టాడు. కొద్ది రోజులకు శబరీష్‌ ప్రవర్తనపై పద్మశ్రీకి అనుమానం వచ్చింది. ఆరా తీయగా అంతకుముందే వివాహమైందని తెలిసింది. దీంతో  ఆమె శబరీష్‌ను నిలదీయడంతో ఇరువురికీ గొడవలు మొదలయ్యాయి. దీంతో శబరీష్‌ ఆమెని చంపాలని ఫిక్స్ అయ్యాడు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి రెండు మత్తు ఇంజెక్షన్లు వేశాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పద్మశ్రీ స్నేహితుడు ఈ తతంగం అంతా చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అలా ఆమె బతికి బయటపడింది.

More Related Stories