English   

హృతిక్ కి కొత్త తలనొప్పి...కుటుంబం మీద సోదరి సంచలన వ్యాఖ్యలు

Hrithik Roshan
2019-06-14 17:37:38

కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత రాకేష్‌ రోష‌న్ కుమార్తె, హృతిక్‌ రోషన్‌ సోదరి సునైనా రోషన్. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గత కొద్దిరోజులుగా సునైనా ఒక మెంటల్ దిజర్దర్ తో బాధపడుతున్నారని ఆమె బైపోలార్ డిజార్దర్ తో బాదపడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై స్పందించిన సునైనా తనకు ఆరోగ్యం బాలేదన్న వార్తలు ఎవరు సృష్టించారో తెలీడంలేదని, ఇలా మీడియా తన అనుమతి లేకుండా ఇలా వార్తలు ప్రచురించడం సరికాదని తాను బాగానే ఉన్నానని, స్నేహితులతో పార్టీ కూడా చేసుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది, అంతేకాక గతంలో బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడిన సంగతి నిజమే కానీ ఇప్పుడు కోలుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం తన కుటుంబంతో నాకు అభిప్రాయభేదాలు ఉన్నాయని అందుకే కొన్ని రోజులు ఓ హోటల్‌లో గది తీసుకుని ఉంటున్నానని ఆమె పేర్కొంది. అలాగీ ఈ మధ్యనే తన తండ్రి ఇంటికి వెళ్లనని అక్కడ తనకోసం సెపరేట్ గది కూడా ఏర్పాటు చేసుకున్నానని, ఆ గదికి ఇంట్లో నుండి కాకుండా వేరే ద్వారం కూడా ఏర్పాటు చేసుకున్నానని చెప్పుకొచ్చింది. త కుటుంబమే ఓ నరకంలా ఉందని, తన కుటుంబాన్ని ఇంతకు మించి అల్లరి చేయడం ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒకరకంగా ఆమె చేసిన వ్యాఖ్యలకి హృతిక్ ఫ్యామిలీ ఏమని సమాదానం చెబుతుందో ? ఇప్పటికే కంగనా లాంటి ఎన్నో రకాల తలనొప్పులతో బాధ పడుతున్న ఆయనకు సోదరి కొత్త తలనొప్పిగా మారిందన్న మాట.

More Related Stories