English   

రకుల్ ఫ్యాన్స్ ట్రోలింగ్...క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Manmadhudu 2
2019-06-14 17:48:24

చాలా ఏళ్ల క్రితం వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాని అప్పట్లో త్రివిక్రమ్ రచించగా విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. తాజాగా నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా రూపొందుతోంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ లేడీ లీడ్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో మేరవనున్నారు. ఈ సినిమాని ఈ ఆగష్టులో రిలీజ్ కి ప్లాన్ చేయడంతో ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. ఆ ప్రమోషన్స్ లో భాగంగానే సినిమా టీజ‌ర్‌ ని నిన్న విడుద‌ల చేశారు. ఇందులో పెళ్ళి కాని మిడిల్ ఏజ్ పర్సన్ గా, లవర్ బాయ్ గా నాగ్ ఆక‌ట్టుకున్నారు. డైలాగ్స్ కూడా నాగ్ క్యారెక్టర్ ని బట్టి ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ఒక్క‌రి ఫేస్ ని కూడా టీజ‌ర్‌లో చూపించ‌లేదు, లిప్ లాక్స్ ఉన్నట్టు చూపారు కానీ ఒక్కరిని కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక రకుల్ ఫ్యాన్స్ అయితే డైరెక్టర్ ని ఆడుకుంటూ పలు మీమ్స్ సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీంతో ఆ దెబ్బకి క్లారిటీ ఇచ్చిన రాహుల్‌ ఆ మేరకు ట్వీట్ చేశారు, తన లాంటి రకుల్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని, టీజ‌ర్‌ లో ర‌కుల్‌ని చూపించ‌కపోవ‌డానికి కార‌ణం ఆమె కోసం స‌ప‌రేట్‌గా ఓ టీజ‌ర్ క‌ట్ చేశాం. అందుకే ర‌కుల్‌ని టీజ‌ర్‌లో చూపించ‌లేదని రకుల్ కోసం మరో మూడు వారాలు ఆగాలని కోరాడు. ఇక మ‌న్మ‌థుడు 2 చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.  

More Related Stories