English   

రెజీనా ఎంగేజ్ మెంట్ అయిపోయిందా.. సైలెంట్ గా పెళ్లికి ముహూర్తం.. 

Regina Cassandra
2019-06-14 18:14:48

హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ మాత్రం కాలేక‌పోయింది రెజీనా. ఆమెతో పాటు వ‌చ్చిన చాలా మంది హీరోయిన్లు స్టార్స్ అయ్యారు కానీ ఈమెకు మాత్రం ల‌క్ క‌లిసి రాలేదు. మొన్న‌టికి మొన్న సెవెన్ సినిమా డిజాస్టర్ అయిపోయింది. దాంతో ఇప్పుడు సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్పాల‌ని ఫిక్సైపోయింది రెజీనా. అనుకున్న‌ట్లుగానే అన్ని ప్రాజెక్టులు ముందు పూర్తి చేసి పెళ్లి చేసుకోడానికి ఈ ముద్దుగుమ్మ నిశ్చ‌యించుకుంద‌ని తెలుస్తుంది. అందుకే నిశ్చ‌య తాంబూలాలు కూడా మార్చుకున్నార‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. 

ఈ త‌తంగం అంతా ఎవ‌రికీ తెలియ‌కుండా సైలెంట్ గా జ‌రిపించార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. జూన్ 13న ఈమె నిశ్చితార్థం హైద‌రాబాద్ లోనే జ‌రిగింద‌ని తెలుస్తుంది. దీనికి ఇండ‌స్ట్రీ నుంచి ఎవ‌రికీ పెద్ద‌గా ఆహ్వానాలు అంద‌లేద‌ని.. కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే ఇది జ‌రిగింద‌ని టాక్ న‌డుస్తుంది. అప్ప‌ట్లో మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో రెజీనాకు ప్రేమ వ్య‌వ‌హారం ఉంద‌నే ప్ర‌చారం బాగానే జ‌రిగింది. దీనిపై ఇద్ద‌రూ లేద‌ని తేల్చేసారు. ఆ త‌ర్వాత ఎవ‌రి దారి వాళ్లు అన్న‌ట్లు ఉన్నారు. ఇక ఇప్పుడు ఎవ‌రికీ చెప్ప‌కుండా రెజీనా ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయింద‌నే వార్త‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. మ‌రింత‌కీ ఎవ‌రో ఆ వ‌రుడు..?

More Related Stories