English   

ఇంకా లండ‌న్ లోనే మ‌హేష్ బాబు.. ఇండియాకు వ‌చ్చేదెప్పుడు..? 

Mahesh Babu
2019-06-14 18:47:41

అప్పుడెప్పుడో మ‌హ‌ర్షి సినిమా విడుద‌లైన కొత్త‌లో ఫారెన్ టూర్ వెళ్లాడు మ‌హేష్ బాబు. కుటుంబంతో పాటు విదేశాల‌కు వెళ్లాడు ఈయ‌న‌. అక్క‌డికి వెళ్లి 20 రోజులు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ ఇండియాకు రాలేదు సూప‌ర్ స్టార్. జూన్ 10 త‌ర్వాత ఇండియాకు వ‌స్తాడు అని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగినా కూడా ఇప్పటికీ రాలేదు ఈయ‌న‌. మ‌హ‌ర్షి లాంటి సినిమా త‌న‌కు ఇచ్చాడ‌ని.. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లిని కూడా త‌న‌తో పాటే వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు సూప‌ర్ స్టార్. త్వ‌ర‌లోనే ఈయ‌న ఇండియాకు రానున్నాడు. జులై 1 అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌బోయే స‌రిలేరు నీకెవ్వ‌రు రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఆ సినిమా సెట్స్ పైకి వ‌చ్చే నాటికి మ‌హేష్ బాబు ఇండియాకు రానున్నాడు. 

వ‌చ్చీ రాగానే టైమ్ వేస్ట్ చేయ‌కుండా ఇదే సినిమాతో బిజీ కానున్నాడు సూప‌ర్ స్టార్. సింగ‌పూర్ నుంచి మొద‌లు పెట్టి అన్ని దేశాలు క‌వ‌ర్ చేస్తున్నాడు మ‌హేష్. ఇప్ప‌టికే చాలా దేశాలు చుట్టేసిన సూప‌ర్ స్టార్.. మ‌ధ్య‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ కూడా క‌వ‌ర్ చేసాడు. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ నుంచి లండ‌న్ లోనే ఉన్నాడు ఈయ‌న‌. ప్ర‌స్తుతం రీజెంట్ వీధిలో ఫోటో దిగి ట్వీట్ చేసాడు సూప‌ర్ స్టార్. మ‌హ‌ర్షి సినిమాతో తొలిసారి 100 కోట్ల క్ల‌బ్ లో చేరిన మ‌హేష్.. ఇంకా అదే కిక్ లో ఉన్నాడు. దాంతో టూర్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు మ‌హేష్. సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ఉండ‌టంతో ఇప్పుడే సెల‌వులు పూర్తిగా తీసుకుంటున్నాడు మ‌హేష్ బాబు. జులై 1 నుంచి మ‌ళ్లీ పూర్తిగా సినిమాల‌తో బిజీ కానున్నాడు ఈ హీరో.

More Related Stories