English   

విజయవాడ అమ్మాయితో ప్రేమ...వచ్చే ఏడాదే పెళ్లి....రాజ్ తరుణ్ క్లారిటీ

raj
2019-06-14 21:23:24

హీరో రాజ్ తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఓకే రకం కధలను ఎంచుకోవడంతో పడిన దెబ్బకి ఇంతకీ కోలుకోలేదు. దీంతో వరస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు రాజ్. గత ఏడాది మూడు సినిమాలు చేత్శే మూడు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఆ విషయం పక్కన పెడితే తను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటానని సైలెంట్ గా ట్విట్టర్ లో ప్రకటించి కలకలం రేపిన యంగ్ హీరో రాజ్ తరుణ్. ఆ అమ్మాయి డీటెయిల్స్ మాత్రం బయటపెట్టలేదు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేయసి, కాబోయే భార్య వివరాలు బయటపెట్టాడు ఈ హీరో. ఆరేళ్ల కిందట వైజాగ్‌లో జరిగిన తన పుట్టిన రోజు వేడుకలో ఒకమ్మాయిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యిందని, ఆ తర్వాత కలవడం, మాట్లాడుకోవడం మొదలైందని క్రమంగా ఒకరిపై మరొకరికి ఇష్టం పెరిగిందని చెప్పుకొచ్చాడు.  ఆమె విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్తని, ఆమె సింపుల్‌గా ఉండే తెలుగింటి అమ్మాయి అని కానీ అందరి దృష్టిలో పడటం ఆమెకి ఇష్టం లేదని అందుకే ఆమె పేరు చెప్పడం లేదని చెప్పుకొచ్చాడు. అయితే తమ ప్రేమకు, పెళ్ళికి ఇరువురి తల్లిదండ్రులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని రాజ్ తరుణ్ తెలిపాడు. పెళ్లికి తాను రెడీ అని కానీ ఆమె ఆలస్యం చేస్తోందని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని పేర్కొన్నాడు.  

 

More Related Stories