English   

వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌ మూవీ రివ్యూ

movie
2019-06-14 21:37:04

తెలుగు సినీమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కెరీర్‌ను మొదలుపెట్టిన సప్తగిరి తక్కువ కాలంలోనే మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే 2017లో సప్తగిరి ఎల్ఎల్‌బి అనే సినిమా కూడా చేశారు. కమెడియన్‌గా సినిమాలు చేస్తూనే హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన మూడో సినిమా వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాని తెరకెక్కించిన అరుణ్ ప‌వార్ ద‌ర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కధ :
గోవింద (సప్తగిరి ) తన ఊర్లో ప్రజలంతా కాన్సర్ తో చనిపోతూ ఉండడం ఏమీ చేయలేక దానిని ఎలాగైనా అరికట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. తనకు సాయం చేస్తానన్న ఎమ్మెల్యే చేతిలో కూడా మోసపోతాడు. ఈ నేపథ్యంలో దొంగగా మారతాడు. కానీ, దొంగగా అతడు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. అయితే, అనుకోకుండా ఆర్కియాలజిస్టు‌ కొలంబస్ (వీరెన్ తంబిదొరై)తో చేతులు కలుపుతాడు. ఓ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని కనిపెడితే పంచుకోవచ్చని గోవిందతో కొలంబస్ చెబుతాడు. తన లక్ష్యాన్ని సాధించడానికి ఇదే సరైన మార్గం అని గోవింద నమ్ముతాడు. ఆలయంలో గుప్త నిధుల కోసం వెళ్లినప్పుడు గోవింద అండ్ టీంకు ఒక వజ్రం దొరకుతుంది. ఆ వజ్రం వల్ల గోవిందకు కష్టాలు వచ్చి పడతాయి. ఆ వజ్రం వల్ల ఎందుకు కష్టాలు పడతాడు ? ఆ ఊరి ప్రజలను ఎలా కాపాడుకోగలిగాడు..? అనేది పెద్ద తెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
ఓ నిధి.. దాన్ని దోచుకోవాల‌నుకునే విల‌న్.. వ‌చ్చి కాపాడే హీరో, ఇలాంటి ట్రెజ‌ర్ హంట్ సినిమాలు తెలుగులో బోలెడు వ‌చ్చాయి..ఇప్పుడు మ‌ళ్లీ ఇలాంటి క‌థ‌తోనే వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవిందా అంటూ వ‌చ్చాడు స‌ప్త‌గిరి..ఓ గుడి.. అందులో నిధి.. దానికోసం వేటాడే ఓ బ్యాచ్.. వెంటాడే విల‌న్..ఇలా పాత సీసాలోనే మ‌ళ్లీ కొత్త సారా పోసుకుని ప‌ట్టుకొచ్చాడు ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్..దానికి కామెడీ ట‌చ్ ఇస్తూనే.. మ‌ధ్య‌లో కాన్స‌ర్ ట‌చ్ కూడా ఇచ్చాడు..స‌ప్త‌గిరి ఎప్ప‌ట్లాగే తాను స్టార్ హీరో అనే భ్ర‌మ‌లోనే సినిమా అంతా క‌నిపించాడు..మ‌ధ్య‌లో క‌మెడియ‌న్ అని గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా న‌వ్వించే ప్ర‌య‌త్నం మాత్ర‌మే చేసాడు..ఒకే క‌థ‌లో ట్రెజ‌ర్ హంట్.. ఊరికి మొన‌గాడు.. వజ్రాల వేట అన్నీ చూపించాడు అరుణ్ ప‌వార్. దీంతో సీరియ‌స్ క‌థ‌లో అన్ని ర‌సాలు క‌లిపేస‌రికి ఆల్ మిక్స్ క‌ర్రీ అయిపోయింది వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవిందా. ఫ‌స్టాఫ్‌లో క‌నీసం అక్క‌డ‌క్క‌డా న‌వ్వుకోడానికి కొన్ని సీన్స్ ఉన్నాయి.. కానీ సెకండాఫ్ మాత్రం భ‌రించ‌డం క‌ష్ట‌మే. హీరోకు పిచ్చెక్కినట్లే అక్క‌డ‌క్క‌డా ఏం జ‌రుగుతుందో తెలియ‌క మ‌న‌కు అదే భ్ర‌మ క‌లుగుతుంది. స‌ప్త‌గిరికి హీరో కావాల‌నే కోరిక బ‌లంగానే ఉంద‌ని ఈ సినిమాతో మ‌రోసారి అర్థ‌మైపోయింది. ఇక సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అలా అని వైభవి తన అందచందాలతో ఆకట్టుకున్నదీ లేదు. విలన్ బంగారప్ప (జాస్పర్)ను చాలా భయంకరంగా చూపించారు. కానీ, క్లైమాక్స్‌లో ఆ భయంకర విలన్‌ను హీరో చిటికెలో చంపేశాడు. సప్తగిరిని హీరోగా భరించడం కాస్త కష్టమైన పనే. హీరోయిన్‌గా వైభవి జోషి సినిమాకు చేసిందేమీ లేదు. గోవింద స్నేహితురాలిగా, కన్నింగ్ ఎమ్మెల్యేగా రచన తన పాత్ర పరిధిమేర నటించింది. మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.  
ఫైనల్ గా : వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవిందా.. గోవిందా.. గోవిందా..

 

More Related Stories