English   

మొద‌ల‌వుతున్న విరాట ప‌ర్వం.. న‌క్స‌లైట్‌గా సాయిప‌ల్ల‌వి సంచ‌ల‌నం..

sai
2019-06-14 21:57:16

పడి పడి లేచే మనసు తర్వాత సాయిపల్లవి ఇమేజ్ తెలుగులో కాస్త తగ్గింది. దానికితోడు త‌మిళ‌నాట ఈమె న‌టించిన మారి 2, ఎన్జీకే సినిమాలు కూడా ఫ్లాప్ కావ‌డంతో హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా సాయిప‌ల్ల‌వి సినిమా అంటే ఏదో తెలియ‌ని ఆస‌క్తి మాత్రం ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. తాజాగా ఆమె మ‌రో సంచలన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఏకంగా గన్ను పట్టుకుని నక్సలైట్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సాయిపల్లవి. నక్సలైట్ గా సాయిప‌ల్ల‌విని ఊహించుకోవడం కాస్త కష్టమే అయినా కూడా దర్శకుడు వేణు ఊడుగుల మాత్రం తన క‌థ‌తో ఈమెను మెప్పించాడు. ఈ సినిమా ఓపెనింగ్ జూన్ 15న జ‌ర‌గ‌నుంది.
ఇందులో రానా కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఆయ‌న కోస‌మే ఇన్నాళ్లూ ఈ సినిమా ఆల‌స్యం అయింది. ఈ సినిమాకు విరాటపర్వం 1992 అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. కచ్చితంగా ఈ సినిమాతో తెలుగులో మరో సంచలనం సాయిపల్లవి సృష్టిస్తుందని నమ్ముతున్నారు ఆమె అభిమానులు. మరోవైపు ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా అని.. రానా ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఏడాది చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నీది నాది ఒకే కథ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తర్వాత వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమాతో తన కెరియర్ మరో మలుపు తిరుగుతుందని ఆశిస్తుంది సాయిపల్లవి. మరి వీళ్ళ నమ్మకం విరాట‌ప‌ర్వం సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

More Related Stories