English   

డైరెక్టర్ శ్రీవాస్ కి బంపర్ ఆఫర్

sri
2019-06-14 22:21:53

నిజానికి ఒకప్పుడు తెలుగులో వెంకటేష్ రీమేక్ సినిమాలు చేసేవారు. తమిళ భాషలో రిలీజ్ అయ్యి విజయం సాధించిన సినిమాలను వెంకటేష్ మనకి రీమేక్ చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన రీమేక్స్ చేయడం ఆపేశారు. అయితే బాలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాను వెంకటేష్ ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారన్న విషయం తెలిసిందే.  అజయ్ దేవగణ్, టబు, రకుల్ లు జంటగా నటించిన దేదే  ప్యార్ దే సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్, పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్, అల‌నాటి అందాల భామ ట‌బు లీడ్ రోల్స్ లో నటించిన  ఈ సినిమాకి 50 ఏళ్ళ వ్య‌క్తి 26 ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడతారు. అయితే మొదటి భార్య కుటుంబ సభ్యుల పర్మిషన్ కోసం ఇంటికి వచ్చినప్పుడు జరిగే పాయింట్ తో తెర‌కెక్కించారు. ఈ సినిమాకో చి టాక్ రావ‌డంతో వెంకీ రీమేక్ చేయాల‌ని భావించాడు. సురేష్ బాబు కూడా ఈమధ్యనే వెంకీ దేదే ప్యార్ దే చిత్రాన్ని వెంకీ రీమేక్ చేయ‌బోతున్నాడనే విష‌యం మీద క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా దర్శకత్వ బాద్య‌తలను డైరెక్ట‌ర్ శ్రీవాస్ కి సురేష్ బాబు అప్పగించినట్టు స‌మాచారం. సాక్ష్యం సినిమా ఫ్లాప్ లో ఉన్న శ్రీ వాస్ కి ఈ సినిమా దొరకడం అంటే బంపర్ ఆఫర్ దొరికినట్టే. ఈ విషయం మీద త్వ‌రలోనే అఫీషియ‌ల్ గా ప్రకటించనున్నారట.

More Related Stories