English   

నాగ‌శౌర్య‌కు ప్ర‌మాదం.. యాక్ష‌న్ సీక్వెన్స్ చేస్తుండ‌గా యాక్సిడెంట్.. 

Naga Shaurya
2019-06-15 11:32:31

వ‌రుణ్ తేజ్ యాక్సిడెంట్ ఇంకా క‌ళ్ల ముందే ఉంది. దాన్ని ఇంకా ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. అదృష్టం బాగుండి మెగా హీరోకు ఏం కాకుండా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇప్పుడు ఆ ప్ర‌మాదాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోక‌ముందే మ‌రో హీరో కూడా గాయ‌ప‌డ్డాడు. ఈ సారి నాగ‌శౌర్యకు యాక్సిడెంట్ అయింది. అయితే ఈయ‌న‌కు రోడ్ యాక్సిడెంట్ కాదు.. షూటింగ్ యాక్సిడెంట్ అయింది. ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ‌తో చేస్తున్న సినిమా షూటింగ్ కోసం వైజాగ్ లో ఉన్నాడు నాగ‌శౌర్య‌. అక్క‌డే కొన్ని రోజులుగా షూటింగ్ జ‌రుగుతుంది. తాజాగా ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తుండ‌గా రోప్ లేకుండా స్టంట్ చేస్తున్న నాగ‌శౌర్య‌కు ప్ర‌మాదం జ‌రిగింది. దాంతో కాలికి భారీ గాయం అయింది. హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించ‌డంతో ప‌రిశీలించిన వైద్యులు నాగ‌శౌర్య‌కు 25 రోజులు రెస్ట్ అవ‌సరమ‌ని తేల్చారు. దాంతో షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఛ‌లో, న‌ర్త‌న‌శాల సినిమాల త‌ర్వాత నాగ‌శౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్ లోనే తెర‌కెక్కుతున్న సినిమా ఇది. ఇందులో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా న‌టిస్తుంది.

More Related Stories