English   

రానా విరాటపర్వం మొదలయ్యింది 

Virata Parvam
2019-06-15 14:25:58

అనుకున్నట్టుగానే రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శత్వంలోని ‘విరాటపర్వం 1992’ సినిమా లాంచనంగా మొదలయ్యింది. పీరియాడిక్ సోష‌ల్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ సినిమాని కొద్ది సేప‌టి క్రితం రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలతో మొదలు పెట్టారు. సురేష్ బాబు, సాయి ప‌ల్ల‌వి, వేణు, వెంక‌టేష్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ సినిమా లాంచింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సినిమాకి విక్ట‌రీ వెంకటేష్ క్లాప్ కొట్ట‌గా, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి స్విచాన్ చేయగా, సురేష్ బాబు స్క్రిప్ట్ అంద‌జేశారు. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ జ‌రిపేలా ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలానే ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట‌. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుండగా ముందుగా సాయిప‌ల్ల‌వి పాల్గొనే సన్నివేశాలను షూట్ చేస్తారట.  

More Related Stories