English   

ఎరక్కపోయి ఇరుక్కున యాంకర్ రవి...ఇప్పుడు క్షమాపణలు 

Anchor Ravi
2019-06-15 16:59:06

ప్రముఖ యాంకర్ రవి ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. అదేంటి యాంకర్ రవి ఏంటి ? క్షమాపణలు చెప్పడం ఏమిటని అనుకుంటున్నారా ?. అయితే పూర్తి విషయం ఏంటంటే రవి ప్రస్తుతం పటాస్ అనే షోకి యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పటాస్ విషయం పక్కన పెడితే జబర్దస్త్ లాంటి షోలో ఆది లాంటి వాళ్ళు తమ ప్రాపకం కోసమో లేక అభిమానం కొద్దీనో పవన్ భజన చేస్తూ ఉంటారు. తాజాగా పటాస్ లో కంతేస్తేంట్ లు మారడంతో వాళ్ళలో కొత్తగా వచ్చిన ఒక కంతేస్తేంట్ అయిన మహీధర్ ఆయనకు సపోర్ట్ గా ఒక కామెడీ పార్ట్ చేస్తూ చదువు మీద చదువుకున్నోళ్ళ మీద నమ్మకం ఈ నెల 23నే పోయిందని వ్యాఖ్యానించాడు. అంటే ఈయన కవి హృదయం ఏంటంటే చాడువుకున్నోళ్ళు అందరూ పవన్ ని మోసం చేసి జగన్ లాంటి అవినీతి పరుణ్ణి గెలిపించారని, ఇదే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో దానికి యాంకర్ రవి సపోర్ట్ చేసినట్టుగా కొందరు రవి మీద పడ్డారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యాంకర్ రవి ని ఆడుకుంటున్నారు. ప్రజలను అవమానించే విధంగా కామెంట్స్ చేస్తే దానికి మీరు నవ్వుతూ సపోర్ట్ చేస్తారా అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు. వివాదం ముదరడంతో యాంకర్ రవి ఏపీ ప్రజలకు క్షమాపణలు చెబతూ వీడియో రిలీజ్ చేశాడు. ఆ రోజు టీవీలో జరిగింది ముమ్మాటికీ తప్పేనని అన్నాడు. అయితే యాంకర్‌గా తన స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారని వివరణ ఇచ్చాడు. తనకు ఏపీ ప్రజలు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే ఎంతో అభిమానమని ఈ నెలలోనే ఆయనని కలుస్తున్నానని తనకు వివాడాలు అలవాటు అయిపోయాయని ఆయన చెప్పుకొచ్చాడు. 

More Related Stories