English   

నక్కతోక తొక్కిన నాని హీరోయిన్ 

 Priyanka Arul
2019-06-15 17:09:38

తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటిదాకా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. అయితే ఆమెని  విక్రమ్ కుమార్ నాని కాంబినేషన్ లో చేస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. కనీసం ఇప్పటివరకు టీజర్ కాదు కదా ఆమెకి సంబంధించి ఫస్ట్ లుక్స్ లాంటివి కూడా బయటకు రాలేదు కానీ అప్పుడే ఆమెకు ఇంకో తెలుగు సినిమా వచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. కెరీర్ మొదటిలో మోడల్ గా రాణించిన ప్రియాంక అరుల్ ఈ మద్య కాలంలోనే తమిళ సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటుంది. రెండు మూడు తమిళ సినిమాల్లో నటిస్తున్న ఈమెకు నాని మూవీలో ఛాన్స్ దక్కిన ముహూర్త బలమేమో కానీ ఈ సినిమా రిలీజ్ కాకుండానే రెండో సినిమాకి ఎంపికయ్యింది. శర్వానంద్ హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడయ్యారట. ఆ సినిమాని కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడని సమాచారం. ఈ సినిమాని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ మీద గోపీ ఆచంట, రామ్ సుంకర తెరకెక్కించనున్నారట.

More Related Stories