English   

సినిమా షూట్ లో బాంబ్ బ్లాస్ట్...సందీప్ కిషన్ కి తీవ్ర గాయాలు

sundeep
2019-06-15 19:55:52

ముందు సుధాకర్ కొమకుల, ఆ తర్వాత నాని, తాజాగా వరుణ్‌తేజ్‌, నిన్న నాగశౌర్య ఇక ఈరోజు సందీప్‌ కిషన్‌ ఏమిటి ఈ లిస్ట్ అనుకుంటున్నారా వరుసగా తెలుగు సినీ పరిశ్రమకి చెంది గాయాల పాలవుతున్న నటుల లిస్ట్ ఇది. తెలుగు హీరోలు అందరూ ఇలా వరుసగా గాయాల పాలవుతున్నారు. ఇక ఈరోజు తెనాలి రామకృష్ణ సినిమా షూటింగ్ లో ఉన్న సందీప్‌కిషన్‌ కి తీవ్ర గాయాలు అయ్యాయి. డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూలులో జరుగుతోంది. ఈ సినిమాలో భాగంగా ఒక బాంబ్ బ్లాస్ట్ సీన్ ప్లాన్ చేశారు. అంతా బాగానే ఉందనుకుని బాంబ్ బ్లాస్ట్ చేయగా పైట్ మాస్టర్ కి హీరోకి జరిగిన చిన్న తప్పు వల్ల అప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్ట్ లొ గాయపడ్డారు సందీప్ కిషన్.  ఈ బ్లాస్ట్ జరిగిన వెంటనే యూనిట్‌ సభ్యులు ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

More Related Stories