English   

చిరంజీవి హీరోయిన్ పై క‌న్నేసిన పాకిస్తాన్ క్రికెటర్..

sonali
2019-06-16 07:36:08

అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. స్వ‌యంగా ఈ విష‌యం ఆయ‌నే చెప్పాడు కూడా. త‌న‌కు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్ట‌మ‌ని.. ఆమెను కిడ్నాప్ కూడా చేయాల‌నుకుంటున్నాన‌ని చెప్పాడు పాక్ క్రికెట‌ర్. అంత‌గా మ‌న హీరోయిన్ ను అభిమానిస్తున్న ఆయ‌న షోయ‌బ్ అక్త‌ర్.. రావిల్పిండి ఎక్స్ ప్రెస్. క్రికెట్లో ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు కూడా అవ‌స‌రం లేదు. పాకిస్తాన్ క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్లోనే బ్యాట్స్ మెన్ ను త‌న పాస్ట్ బౌలింగ్ తో చెమ‌ట‌లు ప‌ట్టించిన గ్రేట్ లెజెండరీ బౌల‌ర్ అక్త‌ర్. ఈయ‌న వేసే బాల్స్ కు బ్యాట్స్ మెన్ ప‌డిపోతే.. ఓ హీరోయిన్ చూపుల‌కు ఈయ‌న ప‌డిపోయాడు. ఆమె సోనాలి బింద్రే.. తెలుగుతో పాటు హిందీలో కూడా చాలా సినిమాలు చేసింది ఈ భామ‌.
మ‌రీ ముఖ్యంగా తెలుగులో శంక‌ర్ దాదా ఎంబిబిఎస్, ఇంద్ర‌, మురారి, ఖ‌డ్గం లాంటి సినిమాల‌తో సంచల‌నాలు సృష్టించింది సోనాలి. ఇక హిందీలో కూడా ఈమె ఇమేజ్ అద్భుత‌మే. అక్క‌డ కూడా ఎన్నో సంచ‌ల‌న సినిమాల్లో న‌టించింది. ఈమెను చూసి ఒక‌ప్పుడు త‌న మ‌న‌సు పారేసుకున్నాన‌ని చెబుతున్నాడు షోయ‌బ్ అక్త‌ర్. ఓ స‌మ‌యంలో ఆమె ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నాన‌ని.. ఆమె ఫోటోను కూడా త‌న ప‌ర్సులో పెట్టుకుని మ‌రీ తిరిగేవాడిన‌ని చెప్పాడు అక్త‌ర్. ఒక‌వేళ ఒప్పుకోక‌పోతే కిడ్నాప్ కూడా చేయాల‌నుకున్నాన‌ని చ‌మ‌త్క‌రించాడు షోయ‌బ్ అక్త‌ర్. తాజాగా వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులోమాట చెప్పుకున్నాడు ఈ బౌల‌ర్..

 

More Related Stories