English   

వైఎస్ జ‌గ‌న్ తెలుగు ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం లేదా.. పృథ్వీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Comedian Prudhvi Raj makes comments on telugu film industry
2019-06-16 07:52:16

ఎప్పుడూ ఎవ‌రో ఒక‌ర్ని టార్గెట్ చేయందే పృథ్వీకి నిద్ర ప‌ట్టేలా క‌నిపించ‌డం లేదు. అందుకే ఎవ‌రో ఒక‌రిపై కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయ‌న‌. అయితే ఈసారి ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. ఏకంగా తెలుగు ఇండ‌స్ట్రీపైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు 30 ఇయ‌ర్స్ పృథ్వీ. ఈ క‌మెడియ‌న్ అన్న మాట‌లు ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. వైఎస్ జ‌గ‌న్ అంత పెద్ద విజ‌యం సాధించిన త‌ర్వాత వైసీపీలో తాను కూడా కీల‌క‌మైన స‌భ్యుడిగా ఉంటాన‌ని క‌ల‌లు క‌న్నాడు ఈ క‌మెడియ‌న్. పైగా గెలిచిన త‌ర్వాత జ‌గ‌న్ కూడా అప్పుడు త‌న‌కు సాయం చేసిన వాళ్ల‌ను గుర్తు పెట్టుకుని మ‌రి ప‌ద‌వులు ఇస్తున్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పృథ్వీ విష‌యంలో మాత్రం ఎప్పుడూ అలాంటి ప‌ద‌వి ఇచ్చింది లేదు.. క‌నీసం టాపిక్ కూడా రాలేదు.
దాంతో టాలీవుడ్ పై ప‌డ్డాడు ఈయ‌న‌. వైఎస్ జ‌గ‌న్ గెలిచిన త‌ర్వాత కూడా ఇండ‌స్ట్రీ నుంచి ఒక్కరు కూడా వ‌చ్చి త‌మ నాయ‌కుడికి అభినంద‌న‌లు తెలియ‌జేయ‌లేద‌ని.. అంటే ఆయ‌న గెలిచినా కూడా ఎవ‌రికీ ప‌ట్ట‌దా.. 151 సీట్లు.. అంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయకుడికి క‌నీస మ‌ర్యాద కూడా ఇవ్వ‌డం కూడా తెలియ‌దా అంటూ ఇప్పుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ఈయ‌న‌. నీ స్వ‌లాభం కోసం ఇండ‌స్ట్రీని ఎందుకు మ‌ధ్య‌లోకి తీసుకొస్తున్నావ్ అంటూ పృథ్వీకి ఇప్ప‌టికే కొంద‌రు సినీ పెద్ద‌లు మ‌ర్ధ‌న కూడా చేసిన‌ట్లు తెలుస్తుంది. ఎలాగోలా ముఖ్య‌మంత్రి దృష్టిలో ప‌డి ఏదో ఓ ప‌ద‌వి తీసుకోడానికే ఇలా పృథ్వీ నానా మాట‌లు మాట్లాడుతున్నాడంటూ కొంద‌రు ఈయ‌న‌పై బాహాటంగానే దుమ్మెత్తిపోస్తున్నారు. మ‌రి ఈ ర‌చ్చ ఎంత దూరం వెళ్తుందో చూడాలిక‌.

More Related Stories