English   

చిరంజీవి బర్త్ డే కి సర్ప్రైజ్ గిఫ్ట్

chiru
2019-06-16 09:24:07

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న చిత్రం సైరా. చిరు లీడ్ రోల్ లో కిక్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే గాంధీ జయంతి రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే సినిమా గురించి సినిమా అప్డేట్స్ గురించి చిరంజీవి అభిమానులు మొహం వాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరు బ‌ర్త్ డే( ఆగ‌స్ట్ 22) రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇక ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు సైరా మీద ఒక్కమారుగా అంచనాలు పెంచేలా ఈ ట్రైలర్ ఉండాలనే ఉద్దేశంతో సురేందర్ రెడ్డి - చరణ్ ఉన్నారట. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, తమన్నా, సుధీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి పాత్ర‌లు ఎలా ఉంటాయ‌నే ఆస‌క్తి జ‌నాల‌లో ఉంది. మూవీని స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాకి ముందు రెహమాన్ మ్యూజిక్ అందించడానికి వచ్చి తప్పుకోగా చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories