English   

క్రిష్ క్లారిటీ ఇస్తే గానీ తేలదు ?

krish
2019-06-16 09:39:52

నట సార్వభౌమ, దివంగత సీఎం ఎన్టీఆర్ బయోపిక్ గా 'కథానాయకుడు' 'మహానాయకుడు' సినిమాలను దర్శకుడు క్రిష్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో క్రిష్ తదుపరి సినిమా ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మణికర్ణిక వివాదం జరగడంతో ఆయన బాలీవుడ్ లో ఒక సినిమా తెరకేక్కిస్తాడని కంగనాకి సరయిన సమాధానం చెబుతాడని రకరకాల ప్రచారం జరిగింది. అయితే అయితే ఆయన ఏ హీరోతోనూ కొత్త ప్రాజెక్టును ప్రకటించకపోవడంతో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. క్రిష్ ఇంతవరకూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించకపోవడానికి కారణం ఆయన ఈ సారి సినిమా తీయడం లేదని, క్రిష్ వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నాడని. అది కూడా తన సొంత బ్యానర్లోనని ప్రచారం జరుగుతోంది, వెబ్ సిరీస్ కోసం కథ .. స్క్రీన్ ప్లే - మాటలను పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే ఈ సిరీస్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఇప్పుడు వెబ్‌సీరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది కావున క్రిష్ కూడా ఆ బాట పట్టాలని అనుకుంటున్నారట. అయితే దీని దర్శకత్వ బాద్యతలు తన శిష్యులలో ఒకరికి అప్పగించి ఆయన రాఘవేంద్ర రావు సినిమాలో ఒన్నాఫ్ ది డైరెక్టర్ గా ఉంటారని సమాచారం. అయితే ఏదినిజమో ఏమో ఆయనే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

More Related Stories