English   

ఎన్టీఆర్ విషయంలో అది ఫేక్ న్యూస్ ?

ntr
2019-06-16 10:06:00

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు, తన ఫుల్ కాల్ షీట్స్ జక్కన్నకే ఇచ్చి వైట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కొమరం భీం పాత్ర ని పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా మీద భారీ అంచనాలతోనే ఉన్నాడు. అయితే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా కి సంబంధించి కొన్ని పోరాట సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్. వారు అందించిన సమాచారం మేరకు బ్రిటిష్ సైనికుల తో పోరాడే దృశ్యాల్లో ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్నాడట. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా అంతకు ముందే ఈయన ఒక సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడని ప్రచారం జరిగింది. కొత్త దర్శకుడు నరేంద్రతో కీర్తి సురేష్ చేస్తున్న సినిమా లో ఎన్టీఆర్ అతిధి పాత్రలో కనిపించనున్నాడని, ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు నిర్మాత గా వస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇలా సాయ పదనున్నాడని టాక్ నడిచింది. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం  ఎన్టీఆర్ గెస్ట్ అప్పియరెన్స్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదట. ఈ విషయాన్ని బహిరంగంగా ఖండించక పోయినా అది నిజం కాదని అంటున్నారు

More Related Stories