English   

హీరో శర్వానంద్‌ కు షూట్ లో ప్రమాదం...తీవ్ర గాయాలు....సర్జరీ ?

sharwa
2019-06-16 11:07:55

టాలీవుడ్ హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ , వరుణ్ తేజ్, నాగ శౌర్య , సందీప్ కిషన్ లు షూటింగ్ చేస్తూ గాయపడగా ఇప్పుడు మరో హీరోకి కూడా గాయాలు అయ్యాయి. తాజాగా హీరో శర్వానంద్ కు తీవ్రగాయాలు అయ్యాయని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన తమిళ్ '96' సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూట్ లో భాగంగా బ్యాంకాక్ లో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్న శర్వానంద్, ఓ రిస్కీ షాట్ ను డూప్ లేకుండా చేస్తూ ప్రమాదానికి గురయ్యాడట. సినిమాలో స్కై డైవింగ్ షాట్ ఉండగా, దాన్ని చేస్తూ అయన ప్రమాదవశాత్తూ కిందపడ్డాడని సమాచారం. నిజానికి ఆయన రెండ్రోజులు ప్రాక్టీస్ కూడా చేశారని ఇక మూడో రోజు ప్రాక్టీస్ లో భాగంగా ఆయన ల్యాండింగ్ ఇబ్బంది అయ్యిందని కాళ్ల‌పై ల్యాండ్ కావాల్సిన వ్య‌క్తి భుజాల‌తో ల్యాండ్ అయ్యారట. బరువంతా మీద పడిన కార‌ణంగా షోల్డ‌ర్ డిస్ లొకేట్ అయ్యిందట. కాలు కూడా స్వ‌ల్పంగా ఫ్రాక్చ‌ర్ అయ్యిందని అంటున్నారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత శ‌ర్వానంద్ వెంట‌నే థాయ్‌లాండ్ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేయించుకుని హైద‌రాబాద్ చేరుకుని ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారని సమాచారం. భుజానికి బ‌ల‌మైన గాయం కావడంతో ఆయనకు సర్జరీ చేయనున్నారట. రేపు స‌ర్జ‌రీ చేయనున్నారని ఆ సర్జరీ జరిగాక క‌నీసం నాలుగు రోజులు హాస్పిట‌ల్‌లోనే ఉండాల‌ని డాక్ట‌ర్స్ శ‌ర్వాకు సూచించారని సమాచారం.

More Related Stories