English   

టాలీవుడ్ కుర్ర హీరోలకే ఈ యాక్సిడెంట్ లు...సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ?

tollywood
2019-06-16 11:41:38

టాలీవుడ్ కి బ్యాడ్ టైం నడుస్తోందా ? లేక కుర్ర హీరోలకి బ్యాడ్ టైం నడుస్తోందా అనే విషయం అర్ధం కావడంలేదు. ఇప్పటి పరిస్థితి చూస్తే అలానే ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. నిజానికి కొద్ది సంవత్సరాల క్రితం కమెడియన్ల విషయంలో అలానే అయ్యింది. ఒక్కరిగా మొదలయ్యి చాలా మంది కమెడియన్లు చావు బాట పట్టారు, ఇక ఇపుడు కూడా టాలీవుడ్ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ ఒకరు, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరొకరు, కార్ నడుపుతుండగా మరొకరు ఇలా ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలవుతున్నారు. మొదట జిమ్ లో వర్కవుట్ చేస్తూ చరణ్ గాయపడగా, ఆ సినిమా షూట్ లోనే ఎన్టీఆర్ చేతికి గాయం అయ్యింది. ఇక ఆ ఘటన మరువక ముందే గోపీ చంద్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఇక మొన్న వరుణ్ తేజ్ కార్ యాక్సిడెంట్ కి గురవగా ఆ తర్వాత రోజు ఒక స్టంట్ చేస్తూ నాగ శౌర్య గాయపడ్డారు. నిన్న సినిమా షూట్ లో సందీప్ కిషన్‌ గాయమైంది. ఇక ఈరోజు స్కై డైవింగ్ చేస్తూ ఈరోజు శర్వానంద్ కూడా గాయపడ్డాడు. నిజానికి ఈ వరుస ప్రమాద  ఘటనలతో టాలీవుడ్ ఉలిక్కిపడుతోంది. యాక్షన్ సీన్లతో అభిమానులను ఆకట్టుకోవాలనే కోరికతో రిస్కీ ఫైట్స్, స్టంట్స్ చేస్తూ గాయాల పాలవుతున్నారు. టాలీవుడ్ కి ఏమైంది అనే భయం ఇప్పుడు సినీ జనాల్లో మొదలయింది.

More Related Stories