English   

ఎట్టకేలకి బిగ్ బాస్ మీద క్లారిటీ ఇచ్చిన స్టార్ మా

maa
2019-06-16 12:32:57

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదరు చూస్తున్న తరుణం రానే వస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మూడో సీజన్ రెడీ అవుతోంది. ఇప్పటి వరకు కేవలం ఊహాగానాలకే పరమితం అయిన ఈ బిగ్ బాస్ అతి త్వరలోనే ప్రసారం అవుతుందని స్టార్ మా నిన్న అధికారిక ప్రోమో విడుదల చేసింది. బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కేవ‌లం రెండు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. తొలి సీజ‌న్‌ లో హీరో ఎన్‌టీఆర్ త‌నదైన శైలిలో ఆ షోను ర‌క్తి క‌ట్టిస్తే రెండో సీజ‌న్‌లో నాని ఫర్వాలేదనిపించారు. ఇక మూడో సీజ‌న్‌కు ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ని ప్రచారం నడుస్తున్నా దాని మీద క్లారిటీ లేదు. మూడో సీజన్‌ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు కానీ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయాన్ని మాత్రం స్టార్ మా ప్రకటించలేదు. జులై మూడోవారం లేదా నాలుగోవారంలో ఇది ప్రారంభమవుతుందని చెబుతున్నారు. వ‌చ్చే వారంలో స్టార్ మా యాజ‌మాన్యం ఓ ప్రెస్ మీట్‌ ను ఏర్పాటు చేసి ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వనుందట. అయితే ఈ ఏడాది వ‌ర‌ల్డ్ కప్ ఉన్న నేప‌థ్యంలో బిగ్ బాస్ 3 లేట్ గా మొదలవుతుందని భావించారు. కానీ అన్ని అనుమానాల‌కు స్టార్ మా తెర దించినట్టయింది. అయితే ఈ బిగ్‌ బాస్‌ మరింత కొత్తగా సాగుతుందని ప్రోమోను చూస్తే తెలుస్తోంది. 

More Related Stories