English   

మహేష్ కోసం ఆ హీరోకి అలా హ్యాండ్ ఇచ్చిందా ?

mb
2019-06-16 13:53:51

ఛలో సినిమాతో తెలుగు తెరంగ్రేటం చేసిన రష్మిక మందన్నా 'గీతగోవిందం'తో తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో  ఆమెకు తెలుగులో మంచి మంచి అవకాశాలొస్తున్నాయి. మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక కావటంతో మరోసారి అంతటా చర్చనీయాంశంగా మారింది. అయితీ ఈ విషయంలో ఆమె అదృష్టం అని కొందరు అంటూంటే మరికొందరు ఆమె టాలెంట్ వల్లే అని మెచ్చుకుంటున్నారు. అయితే మహేష్ సినిమా కోసం మరో హీరోకు హ్యాండ్ ఇచ్చిందని సమాచారం. నిజానికి ఆమెకి మహేష్ సినిమాలో ఛాన్స్ రాక ముందు తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా ఒప్పుకుంది. ఆ సినిమాకు డేట్స్ కూడా కేటాయించింది. అయితే ఆమెకు మహేష్ నుంచి ఆఫర్ వచ్చింది. అంతా ఆలోచించుకున్న ఆమె శివ కార్తికేయన్ సినిమా కంటే మహేష్ సినిమానే బెటర్ అనుకుని ఆ సినిమా చేయలేనని చెప్పేసిందట. నిజానికి ఆమె మొదట శివ కార్తికేయన్ సినిమాకే మొగ్గు చూపిందట. కానీ మహేష్ సినిమాలో ఆమె తక్కువ కాల్షీట్స్ కేటాయించాల్సి రావడం, ఎక్కువ రెమ్యునేషన్ కావటం, మహేష్ సినిమా అంటే పెద్ద రేంజ్ లో రిలీజ్ అవుతుందని దాంతో తన మార్కెట్ కు ప్లస్ అవుతుందని భావించి మొదటి హీరోకి హ్యాండ్ ఇచ్చిందట.

 

More Related Stories