English   

కార్తికేయ సెంటిమెంట్ నిజమవుతుందా ?

kart
2019-06-16 15:55:38

ఆర్ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిలో ప‌డ్డ హీరో కార్తికేయ ఈ మధ్య హిప్పీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా మాత్రం నిరాశ‌ప‌ర‌చింది. తాజాగా బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో గుణ 369 అనే సినిమా చేస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమాని తిరుమ‌ల్ రెడ్డి, అనీల్ క‌డియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆరెక్స్ 100 మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా సెట్స్ మీదే ఉంది. అయితే సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమా ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో నడవనుండగా ఈ సినిమా కధ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల జీవితంలో జరిగిన ఘటనల ఆధారం చేసుకుని తెరకేక్కిస్తున్నారట. ఇప్పటికే దాదాపుగా డెబ్బై శాతం సినిమా షూటింగ్ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పూర్తయిందట. ఇది కూడా ఆరెక్స్ 100 లాగామే జరిగిన కధ కావడం, ఆ సినిమా లానే డైరెక్టర్ కధ కావడంతో ఈ సినిమా ఖచ్చిత్మగా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నాడు కార్తికేయ. అదీ కాక మొదటి సినిమా ఫ్లాప్ అవ్వగా, రెండో సినిమా హిట్, ఇప్పుడు మూడో సినిమా ఫ్లాప్ కావడంతో నాలుగో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు కార్తికేయ.

More Related Stories