English   

మళ్ళీ జంటగా చైతూ-శామ్...నాగ్ కూడా ?

nag
2019-06-16 19:37:06

పెళ్లికి ముందు ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ పెళ్లి తర్వాత ఆ జంట గనక సినిమాలో కలిసి నటించారు. దీంతో టాలీవుడ్ లవబుల్ కపుల్ నాగ చైతన్య - సమంతలని గుండెల్లో పెట్టేసుకుని ఆ సినిమాని హిట్ చేశారు ప్రేక్షకులు. రీసెంట్ గా మజిలీ సినిమాలో చైతు -సామ్ లు కలిసి నటించారు. ఆ సినిమాని ప్రేక్షకుల ఏ రేంజ్ లో ఆదరించారో, ఆ సినిమా కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. ఇక మరోమారు ఆ జంట కలిసి నటిస్తే ఎలా ఉంటుందో కదా , అలా ఆ ఇద్దరూ కలిసి మరో మూవీలో కలిసి నటించబోతున్నారనే న్యూస్ ఈ మధ్య కాలంలో ప్రచారం అయ్యింది. అది కూడా అజయ్ భూపతి సినిమా అని కూడా ప్రచారం జరిగింది. అది ఏమో కానీ అందుతున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే సినిమా చేయ‌నున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నాగ్ మన్మధుడు సినిమా రిలీజ్ అయ్యాక  సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. ఇందులో నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండగా, ఆయ‌న‌కి తాత‌గా నాగ్ కనిపించ‌నున్నాడ‌ట‌. బంగార్రాజు సినిమాలో నాగ్ స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా, చైతూకి జోడీగా ఏ హీరోయిన్‌ని ఎంపిక చేయ‌లేదు. ప్ర‌స్తుతం వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళుతున్న స‌మంత చైతూతో నటింపచేస్తే సినిమాకి కూడా క్రేజ్ వ‌స్తుంద‌ని యూనిట్ భావిస్తుంద‌ట‌. ఈ లెక్కన ఫైన‌ల్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. చూడలిమరి ఏమవుతుందో ?

More Related Stories