English   

వరలక్ష్మి రెండు పేజీల లేఖకి విశాల్, రెండు సింపుల్ కౌంటర్

vishal
2019-06-16 20:00:01

తమిళ హీరో విశాల్, సీనియర్ నటుడు శరత్ కుమార్ మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. కానీ ఆయన కూతురితో మాత్రం విశాల్ స్నేహంగా ఉండేవాడు, స్నేహం అనే కంటే సన్నిహితం అనే పదం వాడచ్చు, దీంతో అప్పట్లో వీరికి పెళ్లి కూడా జరగనుందని ప్రచారం జరిగింది. అయితే ఎప్పుడూ వీరిద్దరూ ఖండిస్తూ వచ్చేవారు ఆ సమయంలో  విశాల్ హైదరాబాద్ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని పుకార్లకు అడ్డుకట్ట వేశాడు. అయితే అయినా విశాల్‌ తో  స్నేహంగా ఉన్న వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇటీవ‌ల సోషల్‌ మీడియా వేదికగా ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలకుగాను ఓ లెటర్‌ను పోస్ట్‌ చేసిన ఆమె అందులో విశాల్‌ని ఘాటుగా విమర్శించడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారింది. రకరకాల అలిగేషన్స్ చేసిన ఆమె చివరికి నా వోటు వేయను అంటూ ముగించింది. కానీ ఎన్నికల ముందు ఎందుకు అనుకున్నాడో లేక ఫ్రెండ్ తో ఎందుకు అనుకున్నాడో కానీ దీని మీద విశాల్ మాత్రం హుందాగా స్పందించాడు. ఈ వ్యాఖ్య‌లు ఆమె వ్య‌క్తిగతం. ఏ అంశం మీద అయినా ఆమెకు మాట్లాడే హక్కు ఉంటుంది, ఎవరినైనా విమర్శించుకోవచ్చని అక్కడితో ఆపాడు. 

More Related Stories