English   

సాహోకి ఆయనే దిక్కు...ప్రకటన కూడా ?

saaho
2019-06-17 07:49:06

బాహుబలి స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బ‌డ్జెట్‌ మూవీ సాహో. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ జంట‌గా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ముందుగా ఈ సినిమాకి శంకర్ ఎహసాన్ లాయ్ ను సంగీత దర్శకులుగా అనుకున్నారు. అయితే పేర్లు వీరివి పెట్టినా కొన్ని ట్యూన్స్ వేరే సంగీత దర్శకుల చేత మ్యూజిక్ కంపోజ్ చేయించాలని మేకర్స్ భావించడంతో ఆ విషయంలో ఇబ్బంది పడిన ఆ త్రయం ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే అధికారికంగా వాళ్లు వెల్లడించారు. దాంతో ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోనున్నారా అనేది అప్పటి నుండి ఇప్ప్పటి దాకా ఉత్కంటగానే మిగిలిపోయింది. అయితే ఈ విషయంలో ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టుగానే జిబ్రాన్ పేరును ప్రకటించారు మేకర్స్. తెలుగులో రన్ రాజా రన్, బాబు బంగారం, జిల్,  వంటి తెలుగు సినిమాలు చేసిన జిబ్రాన్ కి, తమిళంలో ‘విశ్వరూపం 2’ వంటి భారీ సినిమాకి పనిచేసిన అనుభవం వుంది. సాహో చాప్టర్ 2కి కూడా ఆయన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. దీంతో సినిమాకి కూడా ఆయననే తీసుకున్నట్టు సమాచారం.  

 

More Related Stories