English   

బంపర్ ఆఫర్ కొట్టేసిన రకుల్ ?

rakul
2019-06-17 08:11:13

టాలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది టాలెంటెడ్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ ఒకరు. వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా చెలామణీ అవుతోంది. దాదాపు తెలుగులో టాప్ హీరోలందరితో నటించిన ఈ భామ ప్రస్తుతం ఆమె తెలుగులో నాగార్జున సరసన మన్మథుడు2 సినిమాలో నటిస్తుంది. ఇది ఆగస్ట్ లో రిలీజ్ ఉండగా ఈ ఏడాదిలో ఇప్పటికే “యన్టీఆర్ కథానాయకుడు”, “దేవ్”, “దే దే ప్యార్ దే”, “ఎన్జీకే” చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది రకుల్.  హిందీలో మార్జవాన్ తో పాటు తమిళంలో శివకార్తికేయన్ మూవీలోనూ నటిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే రకుల్‌కి తాజాగా కోలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. అదేంటంటే తాజాగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి జోడీగా నటించే అవకాశం రకుల్‌ కి దక్కిందని అంటున్నారు. ప్రస్తుతం అట్లీ సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాతి సినిమా యంగ్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ తో చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌స్ అని పలువురి పేర్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాకి రకుల్ నీ తీసుకున్నారని చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories