English   

జూనియర్ ఎన్టీఆర్, పవన్ ల మీద జేసీ సంచలన వ్యాఖ్యలు

 JC Diwakar Reddy
2019-06-17 11:29:32

గడిచిన ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమి పాలయిన టీడీపీ ఆ షాక్ నుంచి ఇంకా బయటపడలేదని చెప్పాలి. ఓటమి పాలయిన నేపధ్యంలో టీడీపీ వర్గాలు విశ్లేషణలు చేసుకుంటుంటే జనం మాత్రం చంద్రబాబు పని అయిపోయింది, లోకేష్ వల్ల కాదు కాబట్టి వెంటనే టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతిలో పెట్టేయాలని సోషల్ మీడియాలో చర్చలు మొదలెట్టారు. అయితే ఈ క్రమంలో ఈ మాటలను ఆ పార్టీ వివాదస్పద నేత జేసీ ముందు ఉంచితే ఆయన విశ్లేషణ మరింత షాకింగ్ గా ఉంది. ఒక మీడియా చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీని ఎన్టీఆర్ గురించి కదిలిస్తే, ఆయన పెదవి విరిచేశారు. సినిమా వాళ్లకు ప్రజల్లో పాపులారిటీ ఉంటుందని కానీ అది సినిమాల్లో వాళ్లు బయట ఉంటె ఎలా ఉంటారు అనే ఆసక్తి మాత్రమే ఉందంటున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రోజా లాంటి వాళ్లు జనాల్లోకి వెళ్తే వచ్చి చూసేవాళ్లు ఉంటారు కానీ వోట్లు వేసేవాళ్ళు ఉండరని ఆయన పేర్కొన్నారు. అదంతా నిజమైన ప్రజాబలం అనుకుంటే తప్పు అన్నారు. ఆ సినిమావాళ్లు అద్భుతమైన యాక్షన్ చూసి ముగ్థులై దగ్గరగా చూద్దామని వస్తారని అన్నారు. ఎన్టీఆర్ కి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ఏదైనా చేస్తే రాబోయే రోజుల్లో ప్రజా నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. తారక రామారావుని పోలి ఉన్న ఆయన ఆకారం, లక్షణాలు రాజకీయాల్లో ప్లస్ అవుతాయని జేసీ అన్నారు. అయితే ఇదే సమయంలో జనసేన పవన్ పేరును ప్రస్తావించిన జేసీ, పవన్ పార్టీ పెట్టే సమయంలో తన దగ్గరికి ఓ దూతను పంపారని, అప్పుడే పవన్‌ను చూడటానికి ప్రజలు వస్తారు తప్ప.. ఆయన మాటలు నమ్మి ఎవరూ రారని ఆ దూతకు చెప్పానని జేసీ చెప్పుకొచ్చారు.  

More Related Stories