English   

మన్మధుడు కి కాపీ టెన్షన్ లేనట్టేనా ?

Manmadhudu 2
2019-06-17 12:05:13

సరిగ్గా రెండు మూడు రోజుల క్రితం నాగార్జున కొత్త సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చూసిన మేధావి వర్గం ఊరికే ఉంటుందా? ఆ టీజర్ కి తగ్గట్టు ఏ హాలీవుడ్ సినిమా ఉందా అని వెదికే పనిలో పడింది. అలా వారి పరిశోధన లో తేలిన విషయం ఏంటంటే ఈ సినిమా రెండు విదేశీ సినిమాలకి దగ్గరగా ఉందట. అందులో ఒకటి హాలీవుడ్ కి సంబందించిన వాట్ వుమెన్ వాంట్ అనే సినిమాకి దగ్గరగా ఉంటే, మరొకటి ఏమో ఫ్రంచ్ సినిమా ప్రేతే మెయి తా మై లాగా వుందట. అయితే ఇదే విషయాన్ని సినిమా యూనిట్ తో చర్చించే ప్రయత్నం చేస్తే ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని ఒక విదేశీ సినిమా మా ఇన్స్పిరేషన్తో తెరకెక్కిస్తున్నారని ఆ విషయాన్ని సినిమా టైటిల్స్ లో కూడా వేస్తారని కానీ ఇప్పుడే ఆ సినిమా పేరు ఏమిటో బహిర్గతం చేయడం కుదరదని సమాచారం. ఎందుకంటే ఆ విదేశీ సినిమా పేరు ఏమిటి అని ఇప్పుడే చెప్తే ఆ సినిమా చూసి ఇ మన్మథుడు 2 సినిమాకు వచ్చే ప్రమాదం ఉంది, అలా గనుక జరిగితే రెండు సినిమాలను కంపేర్ చేసి చూడడం వల్ల సినిమాకు ఏమైంది నెగిటివ్ ఉండవచ్చని సినిమా యూనిట్ భావిస్తోంది, ఒక విదేశీ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా సరే అందులో 80 శాతం మేరకు మార్పులు చేర్పులు చేశారట. మన నేటివిటీకి తగ్గట్టు పాత్రలు డిజైన్, స్టోరీ లో మార్పులు ఆంటీ చేశారు. సో మన్మధుడు కి కాపీ టెన్షన్ లేనట్టేనా ?

More Related Stories