English   

కల్కి సినిమా హక్కులు కొన్న ప్రముఖ ప్రొడ్యూసర్

kalki
2019-06-17 20:20:05

గరుడవేగ సినిమాతో సక్సెస్ బాట పట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ తన తాజా సినిమా కల్కితో ఆయన మళ్ళీ హిట్ కొట్టేట్టు ఉన్నారు. ఆ  ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్స్ ట్రైలర్స్ రిలీజయ్యి జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాతో కంటెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాని 1983 బ్యాక్‌డ్రాప్‌లో పీరియడ్ డ్రామాగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌ మీద సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఈ నెల చివర్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కల్కి సినిమా మీద పెరుగుతున్న అంచనాలను బట్టి ఈ సినిమాని తాను రిలీజ్ చేస్తున్నానని అయన చెప్పుకొచ్చారు. ఇక త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించి ఈ సినిమా రిలీజ్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నామని ఆ ట్రైలర్ ఈ సినిమా మీద ఇంకా హైప్ క్రియేట్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అబి చెబుతున్నారు. అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ లేడీ లీడ్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో  స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

More Related Stories