English   

మారోమారు గొప్ప మనసు చాటిన మహేష్ బాబు...రియల్ హీరో

mb
2019-06-18 08:37:54

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చిన్నారులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు. ఊర్లని దత్తత తీసుకున్నా, పెళ్లి రోజున అంధ విద్యార్ధులకి విందు భోజనం పెట్టించినా, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి కోరికలు తీర్చినా ఆయనకే చెల్లింది. తాజాగా ఆయన గురించి మరో గొప్ప విషయం బయటకు వచ్చింది. ఆయన గత మూడన్నరేళ్లలో మొత్తం 1000 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించారట. నిజానికి మహేశ్‌ తో కలిసి ఓ ప్రైవేటు ఆస్పత్రి వివిధ గ్రామాల్లో 18 క్యాంప్‌లు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అవసరమైన 1000 మంది చిన్నారులకు విజయవంతంగా గుండెకు సంబంధించిన సర్జరీలు చేసింది. ఈ విషయాన్ని మహేశ్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఆంధ్రా హాస్పిటల్స్‌, బ్రిటన్‌కు చెందిన హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని ఆమె ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ మంచి పని కోసం సహకారం అందించిన డాక్టర్ పీవీ రామారావుకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. 2018 డిసెంబర్ నాటికి 150 మంది చిన్నారులకు గుండె సంబంధిత చికిత్సలు జరిపించామని గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నమ్రత ఇప్పుడు ఆ సంఖ్య 1000 కి చేరిందన్నమాట.  

 

More Related Stories