English   

సైరాలో కీలక ఘట్టం...చిరంజీవితోనే మొదలు

chiru
2019-06-18 10:14:42

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అక్కడ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆయన ఖైదీనెం150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ మునుపటిలానే సినిమాలు చేస్తున్నారు. అయితే ఆ తర్వాతి సినిమా ఎంత త్వరగా రిలీజ్ చేయాలనుకున్నా అంత లేట్ అవుతూ వచ్చింది. ఒక సారి సెట్ కాలిపోగా మరో సారి రీ షూట్ చేయాల్సి వచ్చి, ఇలా పలు రకాల కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రామ్‌చ‌ర‌ణ్ తేజ్ త‌న సొంత బ్యాన‌ర్ కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్ కంపెనీపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లు సమాచారం. దీంతో వీలయినత త్వరగా ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ కూడా పూర్తి చేసి ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా డబ్బింగ్ నిన్న హైదరాబాద్ లోని శబ్ధాలయ స్టూడియోస్‌ లో మొదలుపెట్టారట. సినిమా మొత్తంలో మెగాస్టార్ చిరంజీవి మొదటగా తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఇక వీలయినత త్వరగా ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ కూడా పూర్తి చేసి ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు నిర్మాత చరణ్. ఈ సినిమాలో చిరంజీవితో పాటు న‌య‌న‌తార‌, అనుష్క‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తితో పాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌ చెందిన న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాని హింది, తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో ఏక‌కాలంలో నిర్మిస్తున్నారు. ఇక అక్టోబర్ 2న రిలీజ్ మాత్రమే మిగిలింది.

More Related Stories