English   

మళ్ళీ రౌడీ పోలీస్ గా మారుతున్న బాలయ్య

 Balakrishna
2019-06-18 11:34:31

నందమూరి బాలకృష్ణ అదేనండీ మన బాలయ్య మరో సారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడట. నిజానికి ఆయన కెరీర్ లో చాలా సార్లు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. అలా నటించిన సినిమాల్లో రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమా చాలా పెద్ద హిట్. ఇక ఆ తర్వాత వచ్చిన లక్ష్మీ నరసింహా కూడా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ జోలికి వెళ్ళలేదు. ఇక ఇన్నాళ్ల తర్వాత బాలయ్య మళ్ళీ పోలీస్ గా నటిస్తున్నాడు. బాల‌కృష్ణ, కె.ఎస్. ర‌వికుమార్ కాంబినేష‌న్‌ లో ఇటీవ‌లే ఓ సినిమా ప‌ట్టాలెక్కిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా వ‌చ్చే నెల‌లో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలోనే బాల‌య్య పోలీస్ పాత్ర‌లో నటించబోతున్నాడట. నిజానికి దీన్ని పొలిటికల్ సినిమాగా తీద్దామని అనుకున్నా, ఇప్పుడు పొలిటికల్ డ్రామాని పోలీస్ డ్రామాగా మార్చేశారని టాక్. ఇకపోతే ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి రౌడీ పోలీస్ అనే అనే టైటిల్ ని పరిశిలీస్తున్నారని టాక్. ఇక రూలర్ అనే టైటిల్ కూడా సి కళ్యాణ్ రిజిస్టర్ చేసి ఉంచడంతో ఈ టైటిల్స్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఇంతకు ముందు బాలకృష్ణ కే ఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో జై సింహా అనే సినిమా వచ్చి యావరేజ్ గా నిలిచిన సంగతి విషయం తెలిసిందే .

More Related Stories