English   

మల్లేశం సినిమా ప్రివ్యూ

Mallesham Movie preview
2019-06-18 12:40:56

పోచంపల్లి చేనేత కార్మికుడు, పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథతో తెరకెక్కుతోన్న బయోపిక్ మల్లేశం సినిమా రిలేజ్ కి సిద్దమవుతోంది. ఈ బయోపిక్ లో ప్రియదర్శి మల్లేశం పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీనికి రాచకొండ రాజ్ దర్శకుడు కాగా శ్రీధర్ అధికారి ఆనే ఆయనతో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. నిజానికి ఈయన అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పదేళ్ళ క్రితం తమిళ సినిమా నిర్మించి దెబ్బతిన్నారు. ఇప్పుడు మల్లేశం బయోపిక్ ని తనే రాసి, దర్శకత్వం వహించి, నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుండగా నిన్న ప్రెస్ కోసం స్పెషల్ ప్రీమియర్ వేశారు. ఇప్పుడు ఈ సినిమా ప్రిమియర్ టాక్ చూద్దాం. ఈ సినిమా కధ విషయానికి వస్తే నల్గొండ జిల్లాలోని ఓ కుగ్రామంలో మల్లేశం కుటుంబం నేతపని చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ గ్రామం అంతా ఇదే వృత్తి చేస్తూ అప్పుల్లో కూరుకుపోతారు. అయితే మల్లేశం చిన్నతనం నుంచి అతని అమ్మ లక్ష్మీ ఆసు పనిచేయడంతో చేయి కూడా పడిపోయేస్థితికి వస్తుంది. ఆ ఊర్లో చాలా మందిది అదే పరిస్థితి. అమ్మ పడే కష్టాలు ఎలాగైనా దూరం చేయాలని చిన్నప్పటీ నుంచే ఏదో ఒకటి ప్రయత్నిస్తుంటారు. మల్లేశం పెద్దయ్యాక ఒక్కొక్క ఆలోచనతో ఆసుయంత్రం వైపు అడుగులు వేస్తాడు. ఎన్నో అవమానాలు మరెన్నో హేళనలు మధ్య ఆశు యంత్రాన్ని ఎలా తయారు చేశారు అనేదే ఈ సినిమా. అలా చూపించే క్రమంలో తెలంగాణ పల్లెలో నేత కార్మికుల మధ్యలో గడిపి వచ్చిన అనుభూతిని, తెలంగాణా సంస్కృతిని, పట్టి చూపే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది త్వరలోనే పూర్తి సమీక్షలో చూద్దాం.

More Related Stories