English   

రచయితగా మారనున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
2019-06-18 14:24:24

విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా డియర్ కామ్రేడ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన ఒక వైపున క్రాంతి మాధవ్ సినిమా చేస్తూనే, మరో పక్క ఈ మధ్యనే తమిళ్ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో సినిమా కూడా ప్రారంభించాడు. అయితే తాజాగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్‌, రచయితగా కనిపించనున్నాడట. రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్‌, ఇజాబెల్లె కథానాయికలు. ముక్కోణపు ప్రేమకథగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ రచయిత పాత్రను పోషిస్తున్నారని సమాచారం. ఆయన రాసిన మూడు కథలు అలానే జరుగుతాయని ఆ కధల్లో కూడా ఆయనే హీరోగా కనిపిస్తారని సమాచారం. సినిమాలో రచయిత పాత్రధారి రాసిన కథలు తెరపై ప్రాణం పోసుకునే కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా అదే కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో రొమాంటిక్‌ హంగులతో వినూత్నంగా తెరకెక్కించారట, నిజానికి ఈ సినిమాలో ఒక పాత్ర సింగరేణి కార్మికుడి పాత్ర అని తెలిసింది. మిగతా పాత్రలు గురించి క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.

More Related Stories