English   

తేజ డైరెక్షన్...కాజల్ కి మాత్రం రెండు బాద్యతలు

kajal
2019-06-18 17:36:36

దర్శకుడు తేజ చాలా మంది నటీనటులని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అందులో కాజ‌ల్ కూడా ఒకరు. కాజ‌ల్‌కి ల‌క్ష్మీ క‌ల్యాణం సినిమాతో ఛాన్స్ ఇచ్చి, ఆ సినిమా ఫ్లాప్ అయినా ఆమె బంగారు భవిష్యత్ కి బాటలు వేయగలిగాడు తేజ. ఇక గతేడాది వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఇద్దరూ హిట్ కొట్టారు. ఇక ఈ మధ్యనే మూడోసారి సీత‌ సినిమా చేశారు. ఈ సినిమాకి పెద్దగా స్పందన రాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మరోసారి మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. కాజల్ కోసం తేజ మరోసారి లేడీ ఓరియెంటెడ్ బ్యాక్‌డ్రాప్‌లో కథను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అయితే సీత దెబ్బకి నిర్మాతలు వెనకడగు వేస్తున్నారో లేక మరేమీ కారణమో తెలీదు కానీ ఈ సినిమాని కాజల్ స్వయంగా నిర్మించనుందట. నిజానికి తను నిర్మాతగా మారి సినిమాలు నిర్మించబోతున్నాననే విషయాన్ని ఆమధ్య కాజల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన నిర్మాణ సంస్థకు కేఏ వెంచర్స్ అనే పేరు కూడా పెట్టింది. ఇప్పుడు తేజతో చేస్తున్న సినిమాతోనే ఆమె నిర్మాతగా కూడా మారనుందన్న మాట.  
 

More Related Stories