English   

కౌసల్య కృష్ణమూర్తి టీజర్ టాక్ 

Kousalya Krishnamurthy Teaser
2019-06-18 18:49:02

కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కౌసల్య కృష్ణమూర్తి సినిమా టీజర్ రిలీజైంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ కేఎస్ రామారావు, సినిమా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు సమక్షంలో చిరంజీవి చేతుల మీదుగా టీజర్ ను విడుదల చేశారు. పల్లెటూరిలో పుట్టిన ఓ సాధారణ అమ్మాయి దేశం గర్వించేలా క్రికెట్ ఆటలో ఎలా ఎదిగిందన్న కధాంశంతో కౌసల్య కృష్ణమూర్తి' చిత్రాన్ని రూపొందించారు. ఓ రైతు కడుపున పుట్టిన అమ్మాయి భారత జట్టులో ఎలా స్థానం దక్కించుకుని.. రాణించిందనే కథతో ఇది రూపుదిద్దుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఐశ్వర్యా రాజేష్ తండ్రిగా, ప్రత్యేక పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించగా ఆమె తల్లోగా ఝాన్సీ, వెన్నెల కిషోర్, రంగస్థలం మహేష్ తదితరులు నటించారు. ఇక ఈరోజు విడుదలయిన టీజర్‌ లో మా ఊళ్లో ఏ ఆడపిల్లైనా క్రికెట్ ఆడటం చూశారా అనే రాజేంద్ర ప్రసాద్ డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. క్రికెట్ చాలా కష్టమైన ఆట, సున్నితమైన ఆడపిల్లలు అస్సలే ఆడలేరని కోచ్ చెప్పడం, కళ్లముందే పంట కాలిపోతుంటే, కన్నబిడ్డనే కాల్చుకున్నట్లుందని రాజేంద్ర ప్రసాద్ చెప్పే డైలాగులు, ఐశ్వర్యా రాజేష్ తల్లిగా నటించిన ఝాన్సీ ఏదైనా సాధించాలంటే ఆశపడితే సరిపోదే పట్టుబట్టి సాధించాలనే డైలాగ్ లు టీజర్ కు హైలైట్‌గా నిలిచాయి.  పంటలు కోల్పోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం. ఈ టీజర్ మీద మీరూ ఓ లుక్కేయండి.

More Related Stories