English   

కాశ్మీర్ వెళ్తున్న మహేష్ బాబు

mb
2019-06-18 20:47:28

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఆయన తర్వాతి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో  తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ (జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్), ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, ‘సరిలేరు నీకెవ్వరు’ తొలి షెడ్యూల్ కశ్మీర్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో హీరో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ రష్మిక కూడా ఉంటుందట. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్‌గా కనిపించనున్న నేపధ్యంలో ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలనే కశ్మీర్‌లో చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ తరవాత రెండో షెడ్యూల్ కోసం యూనిట్ కర్నూల్ వెళ్లనుందని అంటున్నారు.

More Related Stories