English   

జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై...నిజమేనా ?

 Anasuya Bharadwaj
2019-06-19 11:59:22

ఓ పక్క యాంకరింగ్‌ చేస్తూనే మరో పక్క వరుస సినిమా అవకాశాలు చేసుకుంటూ వెళ్తోంది అనసూయ. క్షణం, రంగస్థలం, యాత్ర లాంటి సినిమాల్లో నటించిన అనసూయ నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమె త్వ‌ర‌లో జ‌బ‌ర్ధ‌స్త్‌కి గుడ్ బై చెప్ప‌నుంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. అనసూయకి వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు చెబుతున్నారు. అయితే ఆమె ఈ షో వలన ఎక్కువ సినిమాలకి సైన్ చేయలేక పోతుందట. అందుకే ఈమే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇక ప్ర‌స్తుతం క‌థ‌నం అనే చిత్రం చేస్తున్న అన‌సూయ షో నుండి తప్పుకుందామని నిర్ణయించుకుని ప‌లు సినిమాలకి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఒకరకంగా జబర్ధస్త్ పోగ్రాం వలన వచ్చిన క్రేజ్‌ తో సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న అనసూయ ఇపుడు వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తడంతో ఆ జబర్దస్త్‌ కే బ్రేక్ వేస్తోంది అన్నమాట. అనసూయ అన్న పేరు వినపడగానే మొదట గుర్తొచ్చేది జబర్దస్త్. అంతలా ఆమె పేరు ఆ కార్యక్రమంతో ముడి పడిపోయింది. చూడాలి మరి అనసూయ లేకుండా జబర్దస్త్ ఎలా ఉంటుందో ? 

More Related Stories