English   

అమలా పాల్ నగ్నంగా...టీజర్ రిలీజ్  

Aadai teaser
2019-06-19 12:11:11

 తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన కూడా నటించిన తమిళ నటి అమలా పాల్ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ పెళ్లి చేసుకొని సినిమాలకు బై చెప్పింది. కొంతకాలం తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె రీ ఎంట్రీ నుండి పూర్తిగా గ్లామర్ షో చేస్తోంది. తాజాగా అమలాపాల్ తమిళంలో ‘ఆడై’ పేరుతో తమిళ్‌లో ఒక సినిమాను చేస్తోంది. ఈ సినిమాని తెలుగులో ‘ఆమె’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేసారు. ఈ టీజర్‌లో కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఓ తల్లి కంప్లైట్ చేయడం. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం, ఒక అద్దాల భవనం ముందు జనం గుమికూడడం లాంటివి ఈ టీజర్ లో చూపించారు. చివరిగా నగ్నంగా ఉన్న అమలా పాల్ ఉలుక్కిపడి లేవడం చూపించారు. టీజర్ మాత్రం సినిమా అంచనాలు పెంచేదిగానే ఉంది. ఈ టీజర్ చూసిన పలువురు సినీ ప్రముఖులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా అక్కినేని స‌మంత త‌న ట్విట్ట‌ర్ ద్వారా .. ఆడై టీజ‌ర్ అద్భుతంగా ఉంది. ఎంతో ఆస‌క్తితో ఉత్కంఠ‌ని రేపేలా ఈ టీజ‌ర్ ఉంది. బెస్ట్ విషెస్ టూ అమ‌లా పాల్‌. సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాని త‌న ట్వీట్‌లో పేర్కొంది. మరి అంతలా ఈ టీజర్ లో ఏముందో మీరూ చూడండి మరి.
 

More Related Stories